సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
చౌటుప్పల్. మన సాక్షి ;
చౌటుప్పల మండల కేంద్రంలోని నేలపట్ల గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ బైఎలక్షన్ లో ఊరికిచ్చిన మాట ప్రకారం గెలిచిన తర్వాత సీసీ రోడ్ల నిర్మాణం చేయిస్తానని ఇచ్చిన మాట ప్రకారము ఊరికీ సీసీ రోడ్డు మంజూరు చేసి ప్రారంభించినట్లు తెలియజేశారు.
తెలంగాణలోని అన్ని గ్రామాలు అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఊరికిచ్చిన మాట నెరవేర్చడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేణు, ఎంపీటీసీ తడాఖా పారిజాత మోహన్, గంజి లింగేష్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని శాలువతో ఘనంగా సన్మానించారు.









