మిర్యాలగూడ: కేంద్ర మంత్రికి వినతి

మిర్యాలగూడ: కేంద్ర మంత్రికి వినతి

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

కేంద్రం రద్దు చేసిన చేనేత పథకాలన్నింటిని పునరుద్ధరించాలి,చేనేతలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి బీసీ నాయకులు మారం శ్రీనివాస్ కోరారు.
అందరికి అన్నం పెట్టే అన్నదాత రైతులకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎలాగైతే ఉన్నదో, అదేవిధంగా అందరి నగ్నత్వాన్ని దాచే వస్త్ర దాత నేతన్నలకు చేనేత మంత్రిత్వ శాఖ ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు.

 

కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత రద్దు చేసిన చేనేత పథకాలను పునరుద్ధరించాలని బుధవారం బిజెపి పార్లమెంటరీ సభ్యురాలు భారతి బెన్ ధీరు భాయ్ షాల్ కు శాలువా కప్పి వినతిపత్రం అందజేశారు.పోచంపల్లి సహకార సంఘం లో చేనేత రంగ సమస్యల అధ్యయనం కోసం వచ్చిన పార్లమెంటు సభ్యులను కలిసిన పద్మశాలి చేనేత నాయకులు మారం శ్రీనివాస్ పద్మశాలి, మాస్టర్ రివర్ ఎన్నం శివకుమార్, పద్మశాలి రాష్ట్ర చేనేత కార్యదర్శి మిరియాల వెంకటేశం, శాబ్దుల్లాపూర్ రేగటి చేనేత సంఘం ఉపాధ్యక్షులు తిరందాస్ కనకయ్యలు కలిసి వినతిపత్రం అందజేశారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నేతన్నల కోసం అమలులో ఉన్న చేనేత పథకాలు 2014 నుండి అమలు కావట్లేదని ఆవేదనా వ్యక్తం చేస్తూ చేనేత సహకార సంఘాలలో భారీగా వస్త్ర నిల్వలు పేరుకుపోయి చేనేత కళాకారులకు పని లభించక ఆకలి చావులకు గురవుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేనేత మిత్ర, చేనేత చేయూత అందక అనేక యిబ్బందులకు గురవుతున్నారు.

 

Also Read :

 

నూతన చేనేత కుటుంబాలకు ట్యాగ్ తో పాటు చేనేత సహకారంలో మెంబర్షిప్ కూడా ఇప్పించాలని తెలియజేస్తూ చేనేతలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లతొ పాటు షెడ్లు స్థలం, మౌలిక వసతులు కూడా కేంద్రం కేటాయించాలి. వారి పిల్లలకు పై చదువుల కోసం పూర్తి సబ్సిడీ లోన్లు, పది లక్షల చేనేత బంధు, చేనేత కుటుంబానికి ప్రతి నెల 5000 రూపాయల పింఛను, హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఏ జబ్బులకైనా ఉచిత వైద్యం కల్పించాలి.

 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు 2 లక్షల రూపాయల వ్యక్తిగత రుణాన్ని ఎలాంటి పూచికత్తు లేకుండా వెంటనే అందించాలి అని అన్నారు.
చేనేత జౌళి శాఖలను విభజించి, చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించడం ద్వారా అన్ని రకాలుగా మెరుగైన సహాయము అందించటానికి ఆస్కారం ఏర్పడుతుంది.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కాలేజీ రాష్ట్ర విభజన పంపకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడం జరిగింది. అందువల్ల తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక జనాభా చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హ్యాండ్లూమ్ టెక్నాలజీ కాలేజీని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంజూరు చేయాలని పార్లమెంటు సభ్యులకు వివరించడం జరిగినది.

 

చేనేత మరియు పవర్ లూమ్ మగ్గాల ఆధునికీకరణ కోసం పథకాలు రూపొందించాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక మంది చేనేత కార్మికులు వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు, కావున కేంద్ర ప్రభుత్వం మెగా క్లస్టర్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు.

చేనేతపై కేంద్రం విధించిన జీఎస్టీ ని ఎత్తివేయాలని లేనిచో చేనేత వృత్తి కనుమరుగయ్యి భవిష్యత్ తరాలు మ్యూజియంలో చూసే వస్తువుగా చేనేత ఉత్పత్తులు చూసుకునే పరిస్థితి దాపురిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్రము హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ట్ డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్ లో ఉన్న క్లస్టర్లను వెంటనే మంజూరు చేయాలి,

 

గతంలో సాంక్షన్ చేసిన క్లస్టర్లకు నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు,60 సంవత్సరాలు పైబడినవారు వృత్తి చేస్తూ మరణించినచో చేనేత కార్మికులకు కేంద్రం మత్స్యకారులకు యిచ్చే విధంగానే చేనేత కార్మికులకు ఐదు లక్షల భీమా సౌకర్యం వర్తింపచేయాలని కోరారు.

 

కేంద్ర ప్రభుత్వం యిప్పటికైనా చేనేత బడ్జెట్ కేటాయించడం వలన అన్ని చేనేత పథకాలను పునరుద్దించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ వీవర్, గంజి బసవలింగం,
కుక్కల సతీష్ తదితరులు పాల్గొన్నారు.