Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Cheruvula Panduga : ఇదేం చెరువుల పండగ..? తూతూ మంత్రంగా జరిపిన అధికారులు..!

Cheruvula Panduga : ఇదేం చెరువుల పండగ..? తూతూ మంత్రంగా జరిపిన అధికారులు..!

దమ్మపేట  ,మన సాక్షి ,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఊర చెరువుల పండగ లో పూర్తిస్థాయిలో కనబడని ప్రజాప్రతినిధులు.  నాలుగు వార్డు మెంబర్ల తోనే చెరువులు పండగ మొదలుపెట్టిన అధికారులు. దీనికి ప్రధాన కారణం మొదటి నుండి మేజర్ పంచాయతీ అయినటువంటి దమ్మపేట పంచాయతీలో ఉన్న గ్రూపు రాజకీయాల కారణమని వచ్చిన ప్రజలు చెవులు కోరుకుంటున్నారు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రాష్ట్రమంతా చెరువులు పండగని అంగరంగ వైభవంగా చేసుకుంటే మండల కేంద్రంలో కేవలం 10 20 మందితోనే చెరువుల పండగని ప్రారంభించి తూతూ మంత్రంగా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకుంటున్నారు .

 

ఇది ఏంటి అని అడిగిన ప్రజలకు కొంతమంది గల్లీ నాయకులు ప్రజలకు ఇది మా సమక్షంలో కాదు సర్పంచ్ మరియు వైస్ సర్పంచ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ కార్యక్రమానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని వింత సమాధానం చెప్పారు.

 

దీనికి ప్రధాన కారణం బి ఆర్ ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు వీరంతా తిని ఒక వ్యక్తి తన భుజాలపై వేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తుంటే దీనిని కొంతమంది చోట మోట గల్లి నాయకులు అతని కి పార్టీలో గల ప్రాధాన్యతను తగ్గించటం కోసం మేమే కార్యక్రమాని సరిగ్గా నిర్వర్తించకుండా ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా గల్లి నాయకులు పలుకుతున్నారు.

 

14 వార్డ్ మెంబర్లు ఉన్న ఈ దమ్మపేట మండల కేంద్రంలో కేవలం నలుగురు వార్డ్ మెంబర్లు పాల్గొనడం మండల కేంద్రంలో బిఆర్ఎస్ లో ఉన్న విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుంది. ఈ కార్యక్రమానికి దూరంగా వివోఏలు ఉన్నారు , ఒక అధికారి కూడా ఇటువైపు ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో కూడా కన్నెత్తి కూడా చూడని అధికారుల వైఖరి కనిపిస్తుంది.

 

సెక్రటరీని ఈ విషయం మీద వివరణ కోరగా నేను అన్ని డిపార్ట్మెంట్ల వారికి సమాచారం ఇచ్చాను. వారు రావడం రాకపోవడం వారికి సంబంధించిన విషయమని ఒక హాస్యాస్పదమైనటువంటి సమాధానం సెక్రటరీ ఇవ్వటం విడ్డూరంగా ఉంది.

 

ఈ విషయం మొత్తం మీద చూస్తే కేవలం సర్పంచ్ , వైస్ సర్పంచ్ మీద ఉన్నటువంటి ప్రాధాన్యతను తగ్గించడానికి అన్ని వర్గాల వారు , అధికారులు తోటి వార్డు మెంబర్లు కంకణం కట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు