Narayanpet : చిల్డ్రన్స్ హోమ్ ఆకస్మిక తనిఖీ చేసిన సివిల్ జడ్జి.. సిబ్బందిపై ఆగ్రహం..!
Narayanpet : చిల్డ్రన్స్ హోమ్ ఆకస్మిక తనిఖీ చేసిన సివిల్ జడ్జి.. సిబ్బందిపై ఆగ్రహం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా నారాయణపేట పట్టణంలోని బోరం బావి దగ్గర ఉన్న చిల్డ్రన్స్ హోమ్ నీ శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి వీంధ్య నాయక్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందరు హోమ్ లో ఉన్నారా లేదా అని ఆరా తీశారు. ఆజరు పట్టికను పరిశీలించారు. రోజు ఆహార దిన పట్టికను అడిగి వసతులను, హోమ్ లో పనిచేస్తున్న స్టాఫ్ మెంబర్స్ ఆజరుపట్టికను చూశారు.
డ్యూటీస్ లో ఉన్న స్టాప్ మెంబెర్స్ డ్యూటీలో లేకపోగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారి వస్తువులను ఆహార ధాన్యాల నాణ్యత మరియు త్రాగు నీరు, పరిశుభ్రత, రిజిస్టరు లను, సీసీటీవీ పోటేగినిలను, మూవ్మెంట్ రిజిస్టట్, ఆఫీస్ ఆర్డర్స్ ప్రకారం అడ్మిషన్ తీసుకుంటున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ ప్రతి రోజు ఎంట్రీ చెయ్యాలనీ, వృద్ధుల ఆహార దిన పట్టికను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా, ప్రతి రోజు తాజా కూరగాయలు కొనుగోలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. లైట్స్ మరియు ఫాన్స్ వర్కింగ్ లో ఉన్నాయ చూసారు ఏలాంటి వస్తువులు తీసుకున్న తగిన బిల్లులు తీసుకొని రిజిస్టర్ లో ఎంటర్ చేయాలన్నారు.
ఎలాంటి ఇబ్బం దులు లేకుండా బాత్రూమ్స్, బెడ్ రూమ్స్ క్లీన్గా ఉంచి మీ సొంత తల్లిదండ్రుల్లాగా మరియు ఇంటి లాగా చూసుకోవాలని పని చేసే సిబ్బందికి ఆదేశింశారు. తదుపరి సిబ్బందితో మాట్లాడుతూ చిల్డ్రన్స్ పై అన్ని విధాల 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సొంత ఇంటి వాళ్ళ మాదిరి చూసుకోవాలని సిబ్బందినీ ఆదేశించారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
BIG BREAKING : నేటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!
-
Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!









