మిర్యాలగూడ : సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం

సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే ఇంతటి అభివృద్ధి జరిగేది కాదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఏఆర్ఎస్ గార్డెన్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిధులు హాజరయ్యారు.
అనంతరం శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు,మున్సిపల్ చైర్మన్ తిరుమలగిరి భార్గవ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ శాఖకు చెందిన ఉత్తమ ఉద్యోగులను, శానిటేషన్ వర్కర్లను సన్మానించి, ప్రశంస పత్రాలను అందజేశారు. అనంతరం సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేకుంటే మనం ఏమైపోయే వాళ్లమే అని ఆలోచిస్తే భయంగా ఉందని చెప్పారు.నేడు కృష్ణ జలాలు, గోదావరి జలాలు మన ఇంట్లోకి,మన పొలాల్లోకి వస్తున్నాయన్నారు. కెసిఆర్ నాయకత్వం కావాలని యావత్ దేశ ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు గొప్పగా అభివృద్ధి చెందాయని అన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని పట్టణాభివృద్ధి తెలంగాణలోనే జరిగిందని కొనియాడారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్రప్రభుత్వం పట్టణ ప్రగతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని దశలవారీగా చేపట్టిందన్నారు. ఇందుకోసం నూతన మున్సిపల్ చట్టాన్ని ప్రతిష్టంగా రూపొందించి, అమలు చేస్తూ,మున్సిపాలిటీలకు ప్రతినెల నిధులు విడుదల చేస్తున్నదని తెలిపారు.
పచ్చదనం అభివృద్ధి కోసం మున్సిపాలిటీల బడ్జెట్ ప్రణాళికలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించ బడుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో చైర్మన్ తిప్పన విజయ్ సింహ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు , కౌన్సిలర్లు మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు