సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలి

సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలి

తుంగతుర్తి , మన సాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈనెల 24న జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు పిలుపునిచ్చారు.

 

మండల కేంద్రం లో బుదవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజ్ తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామాల నుంచి బహిరంగసభకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలనీ కోరారు.

 

ALSO READ :

1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

2. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

3. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

 

ఈ సమావేశంలో జిల్లా నాయకులు గుండగాని కవిత రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ పులుసు యాదగిరి,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్రా రెడ్డి,

 

బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు రచ్చ నవీన్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ దొంగరి శ్రీనివాస్, తునికిసాయిలు, చెరుకు పరమేష్, కొండగడుపుల నాగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

1. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

2. Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

3. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!