Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపండుగలుహైదరాబాద్

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడు.. ఎక్కడో తెలుసా..!

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడు.. ఎక్కడో తెలుసా..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు ఆయన అభిమాని. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రకాల గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. కాగా ఓ అభిమాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన అభిమానం చాటుకున్నాడు.

హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడి విగ్రహం ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రైసింగ్ నెంబర్ వన్ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.

రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న విగ్రహం తొలగింపు 

పూజకు ముందు అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన మండపం దగ్గరకు వెళ్ళిన సౌత్ వెస్ట్ డీసీపీ. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిర్వాహకుడు సాయి కుమార్ ను పోలీసులు హెచ్చరించారు. మండపం ఏర్పాటు చేసిన ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ రేవంత్ రెడ్డి రూపం విగ్రహం తొలగించి మరో విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని  పోలీసులు సూచించారు. రేవంత్ రెడ్డి రూపంలో విగ్రహం మార్చి మరో విగ్రహం ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు.

MOST READ : 

  1. Narayanpet : గణపతి పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ దంపతులు..!

  2. Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)

  3. World Archery : వరల్డ్ ఆర్చరీలో తెలంగాణ ముద్దు బిడ్డ.. దేశానికి గర్వకారణం..!

  4. Agricultural Tools : సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు.. దరఖాస్తు ఆహ్వానం..!

మరిన్ని వార్తలు