Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

Hyderabad : CM రేవంత్ Vs కేటీఆర్.. ప్రెస్ క్లబ్ వద్ద భారీ బందోబస్తు..!

Hyderabad : CM రేవంత్ Vs కేటీఆర్.. ప్రెస్ క్లబ్ వద్ద భారీ బందోబస్తు..!

హైదరాబాద్, మన సాక్షి :

రాష్ట్ర రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. సంక్షేమంపై చర్చకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు.

దాంతో ఆయన ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నందున మంత్రులు ఎవరు వచ్చినా తాను చర్చకు సిద్ధమంటూ మరో సవాల్ చేశారు. అంతకుముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చించేందుకు మైకు ఇవ్వరు.. ఇచ్చినా సమయం ఇవ్వరు అందుకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రెస్ క్లబ్ వద్దకు వెళుతున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నందున మంత్రులు ఎవరు వచ్చినా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కేటీఆర్ సవాల్ కు దీటుగా అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీకి రండి

అసెంబ్లీ వద్దకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. తాము 9 రోజుల్లో 9000 కోట్ల రూపాయల రైతు భరోసా అందజేశామని అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇదిలా ఉండగా కేటీఆర్ ప్రెస్ క్లబ్ వద్దకు రావడంతో బీఆర్ఎస్ నాయకులు తరలివస్తున్నారు. దాంతో ఎలాంటి ఆందోళనల సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

MOST READ :

  1. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

  2. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

  3. Nalgonda : సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. మిర్యాలగూడ డిటి జావిద్ అరెస్ట్..!

  4. TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!

  5. KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!

మరిన్ని వార్తలు