Cm Revanth Reddy : షెటిల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి..!
Cm Revanth Reddy : షెటిల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం షెటిల్ ఆడారు. సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన షెటిల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాదారుల నుంచి విడి పించడమే హైడ్రా లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆక్రమణలకు పాల్పడిన వారు వదిలేసి గౌరవంగా తప్పుకో వాలని లేదంటే కూల్చివేస్తామని స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ పోలీస్ అకా డమీలో ‘క్రీడా భవన్ ను ప్రారంభించారు. అనతరం పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు.
హైదరాబాద్ దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ శ్రీమంతులు ఫామ్ హౌస్లు కట్టుకుని, డ్రైనేజ్ నీటిని జలాశయాల్లో కలుపుతున్నారని, అదే నీటిని నగర ప్రజలకు సరఫరా చేస్తే ముఖ్యమంత్రిగా తాను వైఫల్యం చెందినట్లేనని అన్నారు.
చెరువు, కుంటల ఆక్రమణల వల్లే వరదలు ముంచెత్తుతున్నాయని సీఎం తెలిపారు. వాటిని తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామని సీఎం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసీ రివర్ డెవ లప్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి అక్కడ పేదవా రికి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తా మని వివరించారు. మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసుల పట్ల ప్రభుత్వం మానవ త్వంతో వ్యవహరిస్తుందని, వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి పునరావాసం కల్పి స్తామన్నారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాల పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 30 వేల మంది నిరుద్యోగు లకు నియామక పత్రాలు ఇచ్చామని ఈ ఏడాది చివరి నాటికి గ్రూప్-1,2, 3, డీఎస్సీ, పారా మెడికల్ సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని సీఎం తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిజిపి, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మేయర్ లతా ప్రేమ్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Miryalaguda : వారిది మహోన్నత త్యాగం, పరిహారంతో పాటు ఉద్యోగం.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క..!
మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!
మిర్యాలగూడ : ఈ ముఠాలో మామూలోళ్లు కాదు.. ఏకంగా ధర్మల్ పవర్ ప్లాంట్ కే కన్నం..!
Success Story : వ్యవసాయాన్నేి నమ్ముకున్నాడు.. ఏడాదికి కోటి సంపాదన..!










