సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం – latest news
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, మన సాక్షి : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పేర్కొన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మిర్యాలగూడ నియోజక వర్గ వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆర్ధిక సహాయనిధి ద్వారా 41 మందికి మంజూరైన 21 లక్షల 5 వేల రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు.
తెలంగాణ అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి , ఎంపీపీ లు నూకల సరళ హనుమంతు రెడ్డి, ధనావత్ బాలాజీ నాయక్ తో కలిసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు లబ్దిదారులకు చెక్కులను పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ను మరింత పటిష్ట పరిచి చాల పకడ్బందిగా దరఖాస్తు పెట్టుకున్న ప్రతిఒక్కరికి ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు.
పేద , మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ కొండంత అండను ఇస్తుందని తెలిపారు. కార్యక్రమములో జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, అంగోతు హాతిరాం నాయక్, ధీరావత్ రవితేజ నాయక్, ఇరుగు వెంకన్న, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, బీఆర్ఎస్ మండల పార్టి అధ్యక్షులు బాబయ్య, అడవిదేవులపల్లి మండల రైతు బంధు సమితి అధ్యక్షులు సూర్యా నాయక్, ఎంపీటీసీ లు, సోము సైది రెడ్డి, బాలు నాయక్, సర్పంచ్ లు బానావత్ లలిత సక్రు నాయక్, అశోక్ రెడ్డి బారేడ్డి, రామచంద్రు, మారెడ్డి, భీమా నాయక్, రమణ, నాయకులు వజ్రం, తులసిరాం,మేక రవి, పందిరి ప్రతాప్, నాగి రెడ్డి కందుల, పాచు నాయక్, గుర్రం భాస్కర్ రెడ్డి, సేవా నాయక్, బైరం గోపి తదితరులు పాల్గొన్నారు.