Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లావైద్యం

Narayanpet : నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్.ఎం.సి) సభ్యులతో కలెక్టర్ భేటీ..!

Narayanpet : నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్.ఎం.సి) సభ్యులతో కలెక్టర్ భేటీ..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు సంబంధించిన ఐదుగురు సెంట్రల్ టీం సభ్యులతో సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా సెంట్రల్ టీమ్ సభ్యులతో కలెక్టర్ మెడికల్ కళాశాలకు సంబంధించిన నియామకాలు, వివిధ అంశాల గురించి క్లుప్తంగా తెలిపారు.

వైద్య కళాశాల నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వల్ల కొంత ఆలస్యం అయిందన్నారు. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బయోమెట్రి క్ హాజరు, ఫ్యాకల్టీ , ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినందున త్వరలోనే నియమిస్తామన్నారు. మినిమం ఫ్యాకల్టీ ఏర్పాటు చేయాలని, ఇన్ఫెక్షన్ టీమ్ కాంటాక్ట్స్ బేస్ పై తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. జిల్లా అడ్మిస్ట్రేషన్ తరపున కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీం సభ్యులు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్, హాస్పిటల్ సూపరిoటెండెంట్ డాక్టర్ రంజిత్ కుమార్,డి ఎం హెచ్ ఓ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

మరిన్ని వార్తలు