హస్తం గూటికి మరో మాజీ ఎమ్మెల్యే

హస్తం గూటికి మరో మాజీ ఎమ్మెల్యే

న్యూఢిల్లీ, మనసాక్షి : కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యేల చేరికల పరంపర కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అరిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మంగళవారం ఢిల్లీ లో రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రవీణ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణను జనరంజకంగా పాలించుకోవడం కోసం నేతలు హస్తానికి జై కొడుతున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి :

1. BREAKING : సూర్యాపేట జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

2. ఫ్లాష్ .. ఫ్లాష్.. గుర్తు తెలియని మృతదేహం లభ్యం

3. సీతక్క కన్ఫ్యూజన్ అయిందా ..?, క్లారిటీ ఇచ్చిన సీతక్క