మిర్యాలగూడ : కరెంటు లేక రైతుల ఇక్కట్లు

మిర్యాలగూడ : కరెంటు లేక రైతుల ఇక్కట్లు

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ నియోజకవర్గంలో గత మూడు రోజుల నుంచి త్రీ ఫేసు , సింగల్ ఫేస్ కరెంటు లేక రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తామ్మడబోయిన అర్జున్ అన్నారు.
శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ..

 

రాత్రి కరెంటు లేక పనికి పోయి వచ్చి రాత్రి నిద్ర పోవాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కరెంటు లేక రైతులు కరెంటు వస్తూపోతూ నారు మల్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసే టైంలో కరెంటు నాటు కూలీలు వెనుదిరిగిపోతున్నారన్నారు.

 

నిరంతరం త్రీఫేస్ కరెంట్ ఇవ్వాలని కోరుచున్నామని, రాత్రి సమయంలో దోమలు కుట్టడం వల్లప్రజలు చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు , మలేరియా రోగాల బారిన పడుతున్నారని, నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద నారుమల్లు ఎండిపోతున్నాయన్నారు.

 

ALSO READ : 

1. Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!

2. Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!

3. మూడేళ్ల కుమారుడు కు విషం ఇచ్చి.. ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డ తల్లి..!

 

నాగార్జునసాగర్ నీళ్లు విడుదల చేసి రైతులని ఆదుకోవాలని, రైతులకు పూర్తిగా రుణమాఫీ తక్షణమే ఇవ్వాలని ఇవ్వని ఎడల బ్యాంకుల ముందు ధర్నా చేస్తామని అన్నారు. ఎరువులు ఉచితంగా ఇస్తామన్న ముఖ్యమంత్రి తక్షణమే ఇవ్వాలని కోరారు.

 

కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోల గాని వెంకటేష్ గౌడ్, ఊట్లపల్లి సర్పంచి శ్రీనివాస్ , మొల్కపట్నం సీనియర్ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పేరెల్లినగేష్ , భారీపాండు, వీటి నాగరాజు పాల్గొన్నారు.