మిర్యాలగూడ : భారీగా తరలి వెళ్ళిన కాంగ్రెస్ కార్యకర్తలు
మిర్యాలగూడ : భారీగా తరలి వెళ్ళిన కాంగ్రెస్ కార్యకర్తలు
మిర్యాలగూడ , మన సాక్షి :
హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభ కు ఆదివారం మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కార్యకర్తలు వేలాదిగా తరలి వెళ్లారు. స్థానిక ఎన్ఎస్పి క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు బస్టాండ్ రాజీవ్ మీదుగా ఈదులగూడ బైపాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ర్యాలీని బిఎల్ఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. బహి బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున కార్గే తో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభతో రాబోయే ఎన్నికల్లో విజయం మోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి బాలు, నూకల వేణుగోపాల్ రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి , చల్ల అంజిరెడ్డి, రవీందర్ రెడ్డి , జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










