Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : కానిస్టేబుల్ సస్పెండ్..!

Nalgonda : కానిస్టేబుల్ సస్పెండ్..!

Mana Sakshi, Nalgonda :

విధి నిర్వహణలో అక్రమ వసూళ్లకు పాల్పడిన నల్గొండ జిల్లా కేతపల్లి పోలీసు స్టేషన్ కి చెందిన కానిస్టేబుల్ పి. మహేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పి చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 28 న ఉదయం సమయంలో కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో విజయవాడ లో ఒక శుభకార్యానికి వెళ్లి హైద్రాబాద్ కు వస్తున్న వాహనంను తనిఖీ చేయగా అందులో తొమ్మిది బీర్లు ఉన్నాయి.

వారి పై కేసు నమోదు చేస్తాం అని బెదిరించి వారి వద్ద నుండి ఆరువేల రూపాయలు డిమాండ్ చేసి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ద్వారా ఫోన్ పే చేయించుకుని తీసుకునట్లు బాధితులు పిర్యాదు చేశారు.

చేయగా విచారణ అనంతరం నిర్దారణ కాగా ఈ రోజు సదరు కానిస్టేబుల్ నీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైన విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ALSO READ : 

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

Watermelons : పుచ్చకాయల్లోకి రంగు ఎలా నింపుతున్నారో తెలిస్తే షాక్.. అందరూ చూడాల్సిందే.. (వీడియో వైరల్)

Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!

మరిన్ని వార్తలు