చిత్రపురి కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి..!

చిత్రపురి కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని చిత్రపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రాజేంద్రనగర్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో చిత్రపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

చిత్రపురి కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి..!

చిత్రపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్

రాజేంద్రనగర్, మనసాక్షి :

చిత్రపురి కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని చిత్రపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రాజేంద్రనగర్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో చిత్రపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చిత్రపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ…. ఆర్థిక లోటు ఉన్న సొసైటి అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని కావాలనే తపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజం నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసరారు. చిత్రపురి కాలనీ అభివృద్ధి చెందడానికి కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు తాను రాజీనామకైనా సిద్ధంమని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా చిత్రపురి కాలనీ నిర్మాణాలను ఆపలేదని పేర్కొన్నారు.

చిత్రపురి కాలనీ సభ్యులకు తప్ప బయట వ్యక్తులకు ఎక్కడ ఇళ్ల కేటాయింపు జరగలేదని తనపై వచ్చినవన్ని అసత్య ఆరోపణలే అని తెలిపారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన నేను నిర్దోషిగా వైట్ పేపర్ల బయటపడతానని అన్నారు. కొందరు కావాల్సికొని తనపై నిందలు మోపుతున్నారని అవసరమైన వారితో చర్చలకు సిద్ధమని అన్నారు.

 

చిత్రపురి కాలనీ మొత్తం బడ్జెట్ వర్త్ 750 కోట్ల రూపాయలు అవినీతి 300కోట్లు రూపాయలు జరిగిందని ఆరోపిస్తున్నారు. చర్చకు సిద్ధమా అన్ని ప్రశ్నించారు. చిత్రపురి కాలనీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ముఖ్యంగా గతంలో జరిగిన వెయిటింగ్ లిస్టులో ఉన్న అసలైన కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం వారి ఆకాంక్షలు తీర్చడం కోసం ఈ ట్విన్ టవర్ ను ప్రారంభించడం జరిగిందని మిగిలిన వాటిని 24 క్రాఫ్ట్స్ నుంచి అర్హులైన సభ్యులకు ఇచ్చుటకు జనరల్ బాడిలో నిర్ణయించడం జరిగిందని తెలిపారు.

ఇందులో కొంతమంది స్వార్థపరులు రకరకాలుగా అపోహలు ఆరోపణలు సృష్టిస్తున్నారని వాపోయారు. సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ మీద కొంతమంది సభ్యులు కేసులు పెట్టి వేధించడం సరైంది కాదని అన్నారు. చిత్రపురి కాలనీలో కొంతమంది సభ్యులు వారి స్వార్థం కోసం కంప్లెంట్ పెట్టి సొసైటి ముందుకు వెళ్లకుండా ఆపుతున్నారని కొత్తగా కట్టబోతున్న ట్విన్ టవర్స్ ప్రాజెక్టు గురించి మరియు డబ్బులు కట్టిన వారికి మరీ కట్టబోయే వారికి లేనిపోని అపోహలు సృష్టించి సభ్యులను తప్పుదోవ పట్టించడం సరైందని కాదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ యాదవ్, సెక్రటరీ పిఎస్ఎన్ దోర, ట్రేజరర్ టి. లలిత, కమిటీ మెంబర్లు కాదంబరి కిరణ్, మహానంద రెడ్డి, అలహరి పి.వి ప్రసాద రావు, కొంగర రామకృష్ణ ప్రసాద్, రఘు బత్తుల, దీప్తి వాజ్ పేయి. అనిత నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ ; 

BREAKING: తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ధరణి ఫైళ్ల తనిఖీ..! 

Cm Revanth Reddy: నన్ను తప్పించండి.. సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!