Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన సిపిఎం బృందం..!

Miryalaguda : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన సిపిఎం బృందం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రి పాలెం గ్రామ శివారులో పట్టణ పేద ప్రజల కోసం నిర్మించిన 560 ఇందిరమ్మ ఇండ్లను సిపిఎం బృందం ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. గత ఆరేడు సంవత్సరాల క్రితం పేద ప్రజల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారని, అక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో పంపిణీ చేయలేదని దీంతో ఆ ఇండ్లు శిధిలావస్థలో చేరుకున్నాయని తెలిపారు.

గత ప్రభుత్వంలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారని ఆ లబ్ధిదారులకైన ఇండ్లు కేటాయించాలని, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి వెంటనే వారికి ఇండ్లను అందించాలని డిమాండ్ చేశారు.. అక్కడ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలని కోరారు. దానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సిపిఎం టూ టౌన్ కార్యదర్శి భవాండ్ల పాండు, మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్, జిల్లా నాయకులు రాగిరెడ్డి మంగా రెడ్డి, రేమిడల పరుశురాములు నాయకులు తిరుపతి రామ్మూర్తి, ఎండి అంజాద్, గోవర్దన, కోటిరెడ్డి, కోడి రెక్క మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు