Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Bank Customers : బ్యాంకులలో లావాదేవీలు జరిపే కస్టమర్లు ఇలా ఉండాల్సిందే..!

Bank Customers : బ్యాంకులలో లావాదేవీలు జరిపే కస్టమర్లు ఇలా ఉండాల్సిందే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది ఎస్బిఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్ పరిసరాల్లో ఉన్న వారిని ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

ఈసందర్భంగా సిఐ,ఎస్ఐలు మాట్లాడుతూ బ్యాంకులలో, ఏటీఎంలో వద్ద ప్రతిరోజు లావాదేవీలు జరపడానికి వచ్చే కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని, అధిక మొత్తం లో డబ్బులు డ్రా చేసే సమయంలో, తీసుకొని వెళ్లే సమయంలో ఏమర పాటుగా ఉండరాదని తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే సమయంలో కొత్త వ్యక్తులకు ఏటీఎం కార్డ్స్ ఇవ్వరాదని, అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలను నమ్మరాదని తెలిపారు.

బ్యాంకుల వద్ద దొంగలు అధిక మొత్తంలో లావాదేవీలు జరిపే వారిపై మాటు వేసి దొంగతనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. దొంగతనాలకు చెక్ పెట్టడానికి బ్యాంకుల వద్ద ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, బ్యాంకుల వద్ద నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రతిరోజు బ్యాంకుల వద్ద కి లావాదేవీలు జరపడానికి వచ్చే కస్టమర్లు జాగ్రత్తలు పాటించాలని వారు కోరారు. అదేవిధంగా పట్టణంలోని సరాప్ బజార్ మరియు మెయిన్ చౌక్ ఏరియాలో గల బంగారం దుకాణాల వద్ద కూడా తనిఖీలు చేశారు. బంగారం కొనడానికి మరియు ఇతరత్రా వస్తువులు తయారు చేయడానికి వచ్చే వారు లావాదేవీలు జరిపే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు