దాబా హోటల్స్ పై పోలీసుల ఆకస్మిక రైడ్

సిసిఎస్ పోలీసు మరియు స్థానిక పోలీసుల అధ్వర్యంలో బుధవారం రాత్రి సూర్యాపేట రూరల్, సూర్యాపేట పట్టణం, చివ్వెంల పోలీసు స్టేషన్ ల పరిధిలో జాతీయ రహదారి వెంట ఉన్న దాబా హోటల్స్, కిరణాలు పై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఆకస్మికంగా రైడ్స్ నిర్వహించారు.

దాబా హోటల్స్ పై పోలీసుల ఆకస్మిక రైడ్

మద్యం బాటిళ్లు సీజ్, కేసులు నమోదు.

సూర్యాపేట ,  మనసాక్షి :

సిసిఎస్ పోలీసు మరియు స్థానిక పోలీసుల అధ్వర్యంలో బుధవారం రాత్రి సూర్యాపేట రూరల్, సూర్యాపేట పట్టణం, చివ్వెంల పోలీసు స్టేషన్ ల పరిధిలో జాతీయ రహదారి వెంట ఉన్న దాబా హోటల్స్, కిరణాలు పై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఆకస్మికంగా రైడ్స్ నిర్వహించారు.

మద్యం అమ్మకాలు, అక్రమ సిట్టింగులు, అసాంఘిక కార్యకలాపాల పూర్తి సమాచారం మేరకు 21 దాబా హోటల్స్ పై తనిఖీలు నిర్వహించి మద్యం సేవిస్తున్న మందు బాబులను, అమ్మకాలు చేస్తున్న యజమానులను గుర్తించి చేసిఅదుపులోకి తీసుకున్నారు.మద్యం బాటళ్లు సీజ్ చేసి 11 దాబాల పై కేసుల నమోదు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

జాతీయ రహదారి పై అసాంఘిక చర్యలను అదుపు చేయడం, రోడ్డు వెంట భద్రత కల్పించడం, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా చర్యలు తీసుకున్నట్లు, రైడ్ నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపినారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

ALSO READ : తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!