Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

Miryalaguda : అంగ రంగ వైభవంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు..!

Miryalaguda : అంగ రంగ వైభవంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో అంగ రంగ వైభవంగా “శ్రీ గోదాదేవి ( ఆండాళ్) ధనుర్మాస ఉత్సవాలు” సోమవారం ప్రారంభమయ్యాయి.
ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయం 25 సంవత్సరాలు పూర్తిచేసుకొని రజితోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ ప్రారంభ ఉత్సవాల్లో అర్చకులు కారంపూడి రాఘవాచార్యులు కమలకుమార్ , సింహాద్రి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సూదిని వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు చెన్నూరు వేణుగోపాలరావు, గోదాటి నాగలక్ష్మి , ప్రధాన కార్యదర్శి కన్నెగుండ్ల రంగయ్య, సహాయ కార్యదర్శి పి. శ్రీనివాస్, తీగల రమాదేవి , కార్యనిర్వహణ కార్యదర్శి కాసుల సత్యమ్, కోశాధికారి శ్రీనవాసు, కమిటి సభ్యులు గార్లపాటి శ్రీరామ్ రెడ్డి, చిల్లంచర్ల వెంకటేశ్వర్లు, కాకునూరి రోశమ్మ, సువర్ణ లక్ష్మి, మన్నెం విజయలక్ష్మి, పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు