Rajanna Siriailla : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మిక తనిఖీలు

Rajanna Siriailla : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మిక తనిఖీలు

రుద్రంగి, (మనసాక్షి)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండల కేంద్రంలోని మాల్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న వంట గది ని త్వరగా నిర్మించి విద్యార్థులకు అందుబాటులో కి తేవాలని అన్నారు.

 

చందుర్తి మండలకేంద్రంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను,నర్సరీలపై ప్రత్యేక దృష్టి సారించి మొక్కలను కాపాడాలని అన్నారు. కంపోస్ట్ షెడ్లను డంపింగ్ యార్డలను వైకుంఠ ప్రకృతి వనరులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా మండల కేంద్రంలో కాంపోస్టు చెట్టును పర్యవేక్షణ చేసి చెత్తను సేకరించి తరువాత ప్లాస్టిక్, ఇనుము ఇతరత్రా వేస్టేజ్ పై సూచనలు చేశారు.

 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. కాంపోస్టు చెట్టు పక్కనే ఉన్న ఎల్లంపల్లి కాల్వకు గండి పడిన స్థలాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.గండి పడిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయిస్తామని ఏ సమస్య ఉన్నా.. పరిష్కరిస్తామని స్థానిక ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్ తెలిపారు.

 

కలెక్టర్ వెంట జిల్లా అధికారులు, స్థానిక సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్, ఎమ్మార్వో మాజీద్, ఎంపీడీవో రవీందర్, ఏఈ వెంకటేశ్వర్లు, కార్యదర్శి శ్రీనివాస్, స్థానిక నాయకులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

1. TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

2. WhatsApp : వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్ మరొకటి..!

3. Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!