Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet: ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్డర్..!

Narayanpet: ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్డర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రజావాణి, ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును త్వరితగతిన పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి గా సోమవారం కలెక్టర్ ఛాంబర్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ తమ సమస్యల పై దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఆమె సూచించారు.

ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడంతో మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు జిల్లా కలెక్టర్ ఎంతో ఓపిక గా ప్రజలు తీసుకువచ్చిన దరఖాస్తులన్నిటిని స్వీకరించారు.  సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 75 దరఖాస్తులు వచ్చాయనీ,వీటిలో ఎక్కువ శాతం భూమి సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్. డి. ఓ. మధు మోహన్జి ల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

మరిన్ని వార్తలు