Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
నల్గొండBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం

District Collector : వ్యవసాయ మార్కెట్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

District Collector : వ్యవసాయ మార్కెట్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

శాలిగౌరారం, మనసాక్షి:

రైతుల కు ఎటువంటి ఆటంకం కలగ కుండా సత్వరమే ధాన్యం కొనుగోల్లును వేగవంతంగా చేపట్టాలని, లారీల ద్వారా వెంటనే దిగుమతులు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ సివిల్ సప్లై అధికారులను అదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఇలా త్రిపాఠీ శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ ను ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా ఆమె రైతుల తో మాట్లాడారు. అనంతరం వ్యవసాయం మార్కెట్ లోని పలు గోదాం ల్లో సివిల్ సప్లై ఆధ్వర్యంలో చేస్తున్న ధాన్యం దిగుమతులను పరిశీలించారు.గోదాం ల్లో నిల్వ ఉంచిన దాన్యం ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ గోదాం ల్లో అదనంగా మరొక సిబ్బంది ని నియమించాలని అధికారులను ఆదేశించారు.

రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం ను సత్వరమే లారీల ద్వారా ఎగుమతులు, దిగుమతులు చేయాలని కోరారు.రైతులు నాణ్యమైన ధాన్యం ను మార్కెట్ తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కలక్టర్ వెంట డిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిసిఓ పాత్యా నాయక్, సివిల్ సప్లై డిఎం హరీష్, తహసీల్దార్ పి. యాదగిరి, సివిల్ సప్లై డీటీ జ్యోతి, మానిటరింగ్ అధికారి నాగేశ్వర రావు, ఏపీఎం జానకి, సింగల్ విండో సిఈఓ నిమ్మల ఆంజనేయులు, కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ కర్నాటి శంకర్, సిబ్బంది నిమ్మల నరేష్, చిలుకూరి సుమన్, రాజు రైతులు పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు