District collector : యాసంగి ధాన్యం కు మద్దతు ధర తగ్గొద్దు.. రూ.500 బోనస్.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : యాసంగి ధాన్యం కు మద్దతు ధర తగ్గొద్దు.. రూ.500 బోనస్.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నల్లగొండ, మన సాక్షి :
2024 -25 రబీ ధాన్యం మార్కెట్ కు రానున్న నేపథ్యంలో రబీ ధాన్యం సేకరణకు పౌరసరఫరాలు, వ్యవసాయ అనుబంధ శాఖలు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణ, మద్దతు ధర పై దాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు ఉద్దేశించి శనివారం ఉదయాదిత్య భవన్ లో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ రబీలో వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రేడ్ ఏ రకానికి 2320/- రూపాయలు, సాధారణ రకానికి 2,300/- రూపాయల మద్దతు ధరను ప్రకటించాయని, అంతేకాకుండా సన్నధాన్యానికి ప్రోత్సాహకంగా క్వింటాల్ కు 500 /-రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం రబీలో జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 5 వేల హెక్టార్లు సాగయ్యిందని, 12 లక్షల 14449 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం జిల్లాలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు.
మార్కెట్ కు 11 లక్షల 26021 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేయడం జరిగిందని, ఇందులో మిల్లర్లు 5,68,152 మెట్రిక్ టన్నులు ,సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ద్వారా 5,57,869 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
ఈ సంవత్సరం ఖరీఫ్ లో 2 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఇందులో 2,10,000 మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యం, 74,3 టన్నులు సన్న ధాన్యాన్ని కొన్నట్లు తెలిపారు.
కాగా గత రబీలో జిల్లాలో 3 లక్షల 7018 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రబీ లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకుగాను జిల్లావ్యాప్తంగా 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ఇందులో 304 కేంద్రాలు దొడ్డు ధాన్యం కొనుగోలుకు, 71 కేంద్రాలు సన్నధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేస్తామని, మార్కెట్ కు వచ్చే ధాన్యం ఆధారంగా కొనుగోలు కేంద్రాలను పెంచడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
రబీ ధాన్యం కొనుగోలుకు కోటి 39 లక్షల 46,725 గన్ని బ్యాగులు అవసరం అవుతాయని కలెక్టర్ తెలిపారు.గత ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో గుర్తించిన లోపాలన్నింటిని రబీ ధాన్యం సేకరణ సందర్భంగా సరిచేసుకోవాలని ఆమె చెప్పారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలు ,డిఆర్డిఏ, తూనికలు కొలతలు ,అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఎవరి పని వారు నిర్వర్తించాలని, ఎక్కడ తప్పులకు అవకాశం ఇవ్వకూడదని, ధాన్యం కొనుగోలులో ఏవైనా తప్పులు చేసిన, లేదా అందుబాటులో లేకున్నా ఇబ్బందులు సృష్టించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
వ్యవసాయ శాఖ అధికారులతో పాటు, సంబంధిత శాఖల సిబ్బంది ఎల్లప్పుడూ దాన్యం కొనుగోలు కేంద్రాలలో సిద్ధంగా ఉండాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఏదైనా ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగినట్లు లేదా నిర్లక్ష్యం వహించినట్లు తెలిస్తే ఆ సెంటర్ ను తీసివేయడం జరుగుతుందని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు తో పాటు, అన్ని శాఖల అధికారులు ధాన్యం కొనుగోలు కు సంబంధించిన వివరాలన్నింటిని ఒకేలా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ధాన్యం కొనుగోలు కై అన్ని కేంద్రాల వద్ద కాలిపర్స్ తో పాటు, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి పత్రికలలో వచ్చే వార్తలకు సంబంధిత కొనుగోలు కేంద్రం ఇంచార్జిలే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని , ధాన్యం కొనుగోలుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఓ ఆర్ ఎస్ పాకెట్లతో పాటు, మందులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని తూర్పార బట్టే యంత్రాలు, అలాగే గన్ని బ్యాగులు, క్యాలిపర్లు, తూకం కొలిచే యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు తర్వాత వెంటనే ఓపిఎంఎస్ ఎంట్రీ చేయాలని, ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే రైతుల నుండి పాస్ బుక్ ,ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన వివరాలన్నిటిని తీసుకోవాలన్నారు.
రైతులు ధాన్యం తేమశాతం 17 శాతానికి మించకుండా ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసినందుకు 14117 టార్పాలిన్లను అందుబాటులో ఉంచడం జరిగిందని, 200 క్యాలిపర్లు, 253 తూకం కొలిచే యంత్రాలు ఉన్నాయని , జిల్లాలో 146 రైస్ మిల్లులు ఉండగా ,6.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం ఈ రైస్ మిల్లులకు ఉందని వెల్లడించారు.
ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐదుగురు సిబ్బందితో పాటు, అవసరమైన ఫ్లెక్సీ బ్యానర్, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రచార సామాగ్రి, హామాలి అన్నింటిని సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు ధాన్యం రాకుండా చెక్ పోస్ట్ ల ఏర్పాటు తోపాటు, ఇంటర్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే రైతులు ,కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సంప్రదించేందుకుగాను గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని ,ఈ సెల్ లో ఏర్పాటుచేసిన 9963407064 నంబర్ కు వారి సమస్యలను తెలియజేయవచ్చని ఆమె వెల్లడించారు .రబీ ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వద్దని, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన తూ.చా తప్పకుండా పాటించాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా పారసరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డిసిఓ పత్య నాయక్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, ఆర్టీవో, లీగల్ మెట్రాలజీ అధికారులు తదితరులు వారి శాఖల ద్వారా నిర్వర్తించే విధులపై వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రబీ ధాన్యం మద్దతు ధర, ధాన్యం సేకరణ పై రూపొందించిన గోడ పత్రికను, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సమావేశానికి జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు,సిబ్బంది హాజరయ్యారు.
క్లిక్ చేసి ఇవి కూడా చదవండి :
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
TGPSC : అన్ని గ్రూపుల్లో అతడే టాప్..!










