డ్రైనేజీ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం

డ్రైనేజీ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం

చౌటుప్పల్ ,. మన సాక్షి.

మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ చౌటుప్పల్ మున్సిపాలిటీ నీ దత్తత తీసుకుంటా అని ఇచ్చిన హామీ ప్రకారం చౌటుప్పల్ మున్సిపాలిటీకి కేటీఆర్ ఆదేశాల మేరకు 20 కోట్ల రూపాయలతో అండర్ లైన్ డ్రైనేజీ ,సిసి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తున్నాము అని, మరింత అభివృద్ధికి మరో 50 కోట్ల నిధులు కూడా ప్రకటించారు అని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో అతి పెద్ద సమస్య అయినటువంటి డ్రైనేజి సమస్యను సోమవారం స్వయంగా వార్డ్ లలో తిరుగుతూ పరిశీలించిన మునుగోడు ఎమ్మెల్యే చౌటుప్పల్ మున్సిపల్ లో 14వ వార్డ్ లో సోమవారం పర్యటించి సమస్యలను తెలుసుకొని అధికారులతో మాట్లాడి తొందర్లోనే మురికి కాల్వ సమస్యకు పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పనులు పూర్తి చేయిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

 

ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 200 కోట్లతో రహదారులు ,సిసి రోడ్లు , అంతర్గత డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని అన్నారు .బంజారా భవన్ రెండు కోట్లతో మంజూరు చేసుకున్నామని త్వర లో శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. చౌటుప్పల్ జాతీయ రహదారిపై ఉండడంతో ప్రమాదాలు ఎక్కువ జరుగుతుండడంతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేసుకున్నాం త్వరలో ఈ పనులు కూడా జరుగుతాయని తెలిపిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.

 

తెలంగాణ లోని అన్నీ మున్సిపాలిటీ లు అభిరుద్ది పథం లో నడుస్తున్నాయి అని తెలిపారు. 14వ వార్డులోని కాలనీ సమస్యలను వార్డు కౌన్సిలర్ సందగళ్ళ సతీష్ గౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్ళగా, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రధాన సమస్య అయినటువంటి డ్రైనేజీని పరిశీలించి త్వరలో పనులకు ప్రారంభించి శాశ్వత పరిష్కారం అయ్యేలా డ్రైనేజీని నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

 

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

చండూర్, మునుగోడు మండలలో మండల స్థాయి కెసిఆర్ కప్ కబడ్డీ ఆటల పోటీలను సోమవారం ఆయన చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని గ్రామస్థాయిలోనే ప్రతిభను గుర్తించి దానికి తగ్గ కోచింగ్ తీసుకుంటే ఎంతో అత్యున్నత స్థానాలకు క్రీడాకారులు ఎదగవచ్చునని అన్నారు.

 

ఇట్టి క్రీడలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే 1 కోటి 50 లక్షలు విలువ గల మునుగోడు నుండి నలగొండ రోడ్డు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మునుగోడు చండూర్ మండలాలకు సంబంధించిన 42 మంది అర్హులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు వారి చేతుల మీదుగా అందజేశారు. చండూర్ మున్సిపాలిటీ పరిధిలో రేషన్ షాపును ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, యూత్ పట్టణ అధ్యక్షులు తూర్పునూరు నరసింహ నాయకులు తాడూరు పరమేష్ ,వర్కాల రవి, ఢిల్లీ శంకర్ రెడ్డి, తూర్పునూరు మల్లేష్ ,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.