ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యం..!

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా తీసుకొని జగనన్న ప్రభుత్వం రూ 2 65 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , పంచాయతీరాజ్ శాఖ మంత్రి. బి .ముత్యాల నాయుడు అన్నారు.

ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యం..!

ఉపముఖ్యమంత్రి…. ముత్యాల నాయుడు

మెలియాపుట్టి , మన సాక్షి:

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా తీసుకొని జగనన్న ప్రభుత్వం రూ 2 65 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , పంచాయతీరాజ్ శాఖ మంత్రి. బి .ముత్యాల నాయుడు అన్నారు.

పాతపట్నం మండలం కాగువాడ వద్ద మెగా తాగునీటి పథకం పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకము ద్వారా పాత పట్టణం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 448 గ్రామాలకు స్వచ్ఛమైన జలాలు అందిస్తామన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మన జీర్ జిలాని నమూన్, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ శ్రీకాకుళం వైసిపి ఇన్చార్జ్ పేరాడ తిలక్, రెడ్డి శ్రావణ్, పిఎసిఎస్ అధ్యక్షులు ఎం. శ్యాంసుందర్రావు, పలువురు వైసీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : జగన్ వీడియోలతో చంద్రబాబు ట్వీట్.. ఆ వీడియోలు ఏంటో చూడండి..!