రాబోయే రోజుల్లో బలహీన వర్గాలకే రాజ్యాధికారం

రాబోయే రోజుల్లో బలహీన వర్గాలకే రాజ్యాధికారం

మందమర్రి, మన సాక్షి: రాబోయే రోజుల్లో డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో బలహీన వర్గాలకే రాజ్యాధికారం దక్కపోతుందని దళిత శక్తి ప్రోగ్రాం (డిఎస్పీ) జిల్లా కన్వీనర్ రాజు పేర్కొన్నారు. దళిత శక్తి ప్రోగ్రాం 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మందమర్రి పట్టణంలోని డిఎస్పీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజ్య స్థాపన కోసం డాక్టర్ విశారదన్ మహారాజ్ చేస్తున్న పదివేల కిలోమీటర్ల పాదయాత్రను 90శాతం అణగారిన ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాయకులు న్యాయవాది రాజలింగం మోతే, సురేందర్, ఆగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.