దుబాయ్ లో కార్మిక దినోత్సవం

దుబాయ్ లో కార్మిక దినోత్సవం
దుబాయ్, (మనసాక్షి)
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రముఖ దుబాయ్ ఎన్నారై వేములవాడ నియోజకవర్గంలోని మల్లారం గ్రామానికి చెందిన సింగిరెడ్డి ప్రియ వెంకట్ రెడ్డి సోమవారం దుబాయ్ లోని పలు ప్రాంతాలలో పని చేస్తున్న కార్మికులను కలిసి ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వారి బాగోగులు తెలుసుకొని కార్మికులకు తనవంతుగా సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సుమారు 50 మంది కార్మికులకు వారి కుమార్తె దీక్షిత చేతుల మిదిగా అన్నదానం పంపిణీ చేశారు.