ధూపహాడ్ భజన బృందానికి రాష్ట్రస్థాయి గుర్తింపు
ధూపహాడ్ భజన బృందానికి రాష్ట్రస్థాయి గుర్తింపు
పెన్ పహాడ్ , మన సాక్షి :
ధూపహాడ్ భజన బృందానికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భద్రాచలం నందు శ్రీరాముని జన్మ నక్షత్రం సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన భజన పోటీలలో ధూపహాడ్ భజన బృందానికి ప్రథమ గుర్తింపు లభించినది.
తెలంగాణ రాష్ట్రంలో భజన మండలి ఎంపిక చేసినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాన్యపు సిద్దేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ధూపహాడ్ భజన బృందం వారు వివిధ గ్రామాలలో దేవాలయాలలో భజన కార్యక్రమాలు ముందంజలో ఉన్నారని వారన్నారు.
ALSO READ :
- సూర్యాపేట : ఏపూర్ గ్రామాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం
- Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
- Health check : మహిళలు అందరికీ ఆరోగ్య పరీక్షలు.. నల్గొండ జిల్లా కలెక్టర్ అర్.వి కర్ణన్..!
- Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
ఆధ్యాత్మికంగా మరియు ఒక బృందంగా ఏర్పడి గ్రామ దేవాలయాల్లో భజనలు రెండు సంవత్సరాల నుండి చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని వీరి గ్రామ భజన మండలి ఎంపిక చేయడమైనది వీరికి భద్రాచలం దేవాలయం నుండి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో మాందాటి రాజు, గందె లక్ష్మయ్య, కీత సరోజనమ్మ, చెరుకుపల్లి ధనలక్ష్మి, సావిత్రమ్మ, లింగమ్మ, రాజేశ్వరి, శోభ ,పద్మ ,రంగమ్మ, వినోద ,అనిత, ధనమ్మ ,దుర్గమ్మ, విజయ, కాంతమ్మ, రామ్ బాయమ్మ, వెంకటయ్య, నారాయణ, లక్ష్మమ్మ, నాగమ్మ, సరోజనమ్మ, సత్యమయ్య తదితరులు పాల్గొన్నారు









