Miryalaguda : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. మిర్యాలగూడలో భారీ వర్షం..!
Miryalaguda : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. మిర్యాలగూడలో భారీ వర్షం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఫెంగల్ తుఫాన్ తమిళనాడును వణికిస్తుంది. తీరం దాటిన తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటు తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల తాకిడికి పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. అదే విధంగా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
రైతులకు ఇక్కట్లు :
ఫెంగల్ తుఫాన్ ప్రభావం వ్యవసాయ రంగంపై పడింది. మిర్యాలగూడ ప్రాంతంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని వరి పొలాలు కోతకు వచ్చాయి. ఆలస్యంగా నాట్లు వేయడం వల్ల ఇప్పుడే వరి కోతలు సాగుతున్నాయి.
దాంతో పాటు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిలిచి ఉంది. రైస్ మిల్లుల వద్ద రైతులు ధాన్యం ట్రాక్టర్లతో ఉన్నారు. వర్షం కారణంగా ధాన్యం తడిసి ముద్దయింది. వరి కోతలు కోసే సమయంలో వర్షాలు రావడం వల్ల రైతుల భారీగా నష్టపోనున్నారు.
MOST READ :









