ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి

ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయం నియోజవర్గ స్థాయి జోనల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో ఆరు నెలలు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయని తెలిపారు.

 

రాజకీయ సమీకరణాలను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ కార్యకర్తలు రాజకీయ చైతన్య కలిగి ఉండాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రజాఉద్యమాలు చేపట్టాలని సూచించారు.

 

గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు వచ్చే ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధం కావాలని గెలుపు కోసం సైనికులుగా పనిచేయాలని కోరారు. కార్యకర్తల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇

 

ఈనెల 20న సాగర్ రోడ్ లోని వైష్ణవి గ్రాండ్ లో నియోజవర్గ స్థాయి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పొలిటి బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యకర్తలు అధిక సంఖ్యలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రేమిడాల పరుశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, వినోద్ నాయక్, తిరుపతి రామ్మూర్తి, పిలుట్ల సైదులు, కందుకూరి రమేష్, రొంది శ్రీనివాస్,బాల సైదులు, అవుతా సైదులు, పాపా నాయక్, నూకల వేణుధ రెడ్డి, బాబు నాయక్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు…