మిర్యాలగూడ : రేపు నిరుద్యోగ నిరసన ర్యాలీ
మిర్యాలగూడ : రేపు నిరుద్యోగ నిరసన ర్యాలీ
విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు
మిర్యాలగూడ, ,మనసాక్షి
నల్గొండలో శుక్రవారం నిర్వహించే నిరుద్యోగుల నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి కోరారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ హజార్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సిద్దునాయక్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
28 న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య నేతలు విచ్చేయుచున్నారన్నారు.
.నీళ్లు నియామకాలు నిధుల కొరకు సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కటి నెరవేరకపోగా ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ కనీసంగా ఊరుకోక ఉద్యోగం ఇవ్వక ప్రశ్నాపత్రాలని అమ్ముకొని నిరుద్యోగుల నుండి నోటిఫికేషన్ల పేరుతోటి అప్లికేషన్ రూపేనా కోట్ల రూపాయలు దండుకొని నిరుద్యోగులను నిండా ముంచాడన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ గట్టిగా కొట్లాడుతుందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీలు దీక్షలు చేస్తున్న కారణంగా నల్లగొండ జిల్లాలో కూడా భారీ ఎత్తున చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశం మేరకు ఈ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ పదాన్ని బొంద పెట్టి భారత రాష్ట్ర సమితిగా ఏర్పరచుకొన్న ఈ ఊసరవెల్లి కేసిఆర్ ని గద్ద దించే వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి కాంగ్రెస్ కార్యకర్త అండగా ఉండాలన్నారు.
ఈ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉన్నదని, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరములోని రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని, కావున మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుండి బైక్ ర్యాలీ అక్కడి నుండి నల్లగొండ వై జంక్షన్ వరకు చేరుకొని అక్కడినుండి పాదయాత్రగా బయలుదేరి క్లాక్ టవర్ సెంటర్ దగ్గర బహిరంగ సభ ఉన్నదన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి, జిల్లా ముఖ్య నేతలు పాల్గొంటారని, పెద్ద ఎత్తున నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిస్తున్నామన్నారు.. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ జంగిలి లింగయ్య , పోటేపాక వినయ్, గుడిపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.









