మానవ అక్రమ రవాణా నిర్మూలించడం అందరి బాధ్యత..!
మానవ అక్రమ రవాణా నిర్మూలించడం అందరి బాధ్యత..!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :
మనుషుల అక్రమ రవాణా నిర్ములన తో ప్రజలు అందరు భాగస్వామ్యం కావాలి అని షాద్ నగర్ సీడీపీఓ నాగమణి, ప్రజ్వల స్వచ్చంద సంస్థ కోఆర్డినేటర్ సురేష్ కుమార్ అన్నారు. ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ షాద్ నగర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ కి నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమం స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీస్ లింగారెడ్డి గూడెం నందు నిర్వహించారు.
జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం లోనే 3 వ అతిపెద్ద నేరం అని, ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు మహిళలు దీని బారిన పడుతున్నారు, ముక్యంగా పేద మధ్య తరగతి వారు, ఉద్యోగం, ప్రేమ పెళ్లి, సినిమా అవకాశాల పేరుతో మోసాలకు గురి అవుతున్నారు, ప్రతి ఒక్కరు దీనిపై అవగాహనా పెంచుకొని అప్రమతంగా ఉండాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ టీచర్ తమ పరిధిలోని మహిళలకు, అమ్మాయిలకు అక్రమ రవాణా పై అవగాహనా కల్పించాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇది మానవతా దృక్పతం తో చేయాలనీ, దీని వలన చాలా మంది అమ్మాయిలు రక్షింప బడతారు అని అన్నారు. ప్రజ్వల స్వచ్చంద సంస్థ కోఆర్డినేటర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా నిర్ములన కొరకు ప్రజ్వల సంస్థ గత 28 సంవత్సరాలనుండి లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా పనిచేస్తు 28,600 మంది అమ్మాయిలను కాపాడి పునరావాసం కల్పించడం జరిగింది.
ALSO READ : Rahul Gandhi : MSPపై రైతు నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం..!
ఈ సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహిత డాక్టర్ సునీత కృష్ణన్ సంబంధిత ఐసిడిఎస్, పోలీస్, జుడికల్, ఎడ్యుకేషన్, డి ఆర్ డి ఏ. డిపార్ట్మెంట్ల ల సహకారంతో పని చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లలోని అంగన్వాడీ టీచర్ లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా గ్రామాలలో అవగాహనా కార్యక్రమాలను నిరహించేలా చేస్తూ ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను ఎలా సంప్రదించలో ఈ శిక్షణలో నేర్చుకోవడం జరుగుతుంది.
శిక్షణ తో భాగంగా మానవ అక్రమ రవాణా ఎలా జరుగుతుంది, ఎవరు దీనికి గురి అవుతారు, లైంగిక వ్యాపారం లోకి వెళ్లిన అమ్మాయిల పరిస్థితులు ఎలావుంటాయి సైబర్ ట్రాఫికింగ్ (ఆన్లైన్ మోసాలు), చట్టాలు ఐపిసి, ఐతీపిఏ, పిఓసిఎస్ఓ, చైల్డ్ మ్యారేజ్, Acts, మరియు టోల్ ఫ్రీ నంబర్స్ 1098(చైల్డ్ లైన్), 100 (పోలీస్), 181(మహిళా హెల్ప్ లైన్), 1930(సైబర్ ట్రాఫికింగ్), ల గురించి వివరిస్తూ వాటిని ఎలా ఉపయోగించాలో వివరించడం జరిగింది.
ప్రతి గ్రామంలో సమాజ జాగృతి సంఘాలను ఏర్పాటు చేసి, అప్రమతంగా ఉండాలని అన్నారు. సఖి సెంటర్ (మహిళా సాధికార కేంద్రం) అధికారిని శ్రీమతి మంజుల ద్వారా ప్రత్యేక సెషన్ ను ఇప్పించడం జరిగింది. సఖి కేంద్రం ద్వారా డీల్ చేసిన కేసులకు సంబంధించి వివరాలను పంచుకోవడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం లో ఐసిడిఎస్ సూపర్ వైజర్లు వెంకటమ్మ, పద్మ, ప్రజ్వల సిబ్బంది అనిల్ కుమార్, లెక్కల, మితాళి రాజ్, మండలం లోని అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.
ALSO READ :









