Every Friday: ప్రతీ శుక్రవారం డ్రై డే.. మేయర్ లతా ప్రేమ్ గౌడ్..!

వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ లతా ప్రేమ్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ పరిధిలోని కాళీ మందిర్ చౌరస్తా వద్ద సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ ని కమీషనర్ శ్శరత్ చంద్ర తో కలిసి మేయర్ మద్దెల లత ప్రేమ్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.

Every Friday: ప్రతీ శుక్రవారం డ్రై డే.. మేయర్ లతా ప్రేమ్ గౌడ్..!
రాజేంద్రనగర్, మనసాక్షి :

వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ లతా ప్రేమ్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ పరిధిలోని కాళీ మందిర్ చౌరస్తా వద్ద సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ ని కమీషనర్ శ్శరత్ చంద్ర తో కలిసి మేయర్ మద్దెల లత ప్రేమ్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…సీజనల్ వ్యాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డెంగ్యూ, మలేరియా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటి వాతావరణం లో నీరు నిల్వకుండా, పూల కుండీలలో నీరు తీయుట, కొబ్బరి బొండాలను నిల్వ చేయకుండా, దోమల రాకుండా జాలిలు వాడటం, మస్కిటో రిపేలెంట్స్ ఉపయోగించాలని మరియు ప్రతీ శుక్రవారం ప్రతీ కాలనీ వాళ్ళు డ్రై డే ఫ్రైడే నిర్వహించాలని తెలియజేశారు.

ఎంత శుభ్రత పాటిస్తే అంత ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 20 వ డివిజన్ కార్పొరేటర్ సాయి సాగర్ గౌడ్ 11 వ డివిజన్ కార్పొరేటర్ అస్లాం, మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి, DEE జి. యాదయ్య, AEE రాజకుమార్, RI లు శివ, కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్, TMC శ్రీలత, జూనియర్ అసిస్టెంట్లు శ్రీశైలం, సూర్యప్రకాష్, కిష్టయ్య, శంకరయ్య,వెంకటప్ప, రవి, వర్క్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు,మెప్మా మహిళలు, శానిటరీ జవాన్లు, స్వీపర్లు పాల్గొన్నారు.

ALSO READ :

Good News : రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన..!

Good News : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. ఈ చాన్స్ అస్సలు మిస్ కావద్దు..!