సర్పంచులు త్వరలో మాజీలు.. అయితే ఇక వారి స్థానంలో వేరే..!

ఫిబ్రవరి నెల 1 వ తేదీన గ్రామపంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగుస్తుండడంతో ఆ గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులను మండల పరిషత్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు జాబితాను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించారు.

సర్పంచులు త్వరలో మాజీలు.. అయితే ఇక వారి స్థానంలో వేరే..!

జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపిన మండలాధికారులు..

రంగారెడ్డి జిల్లా మాడ్గుల, మన సాక్షి :

ఫిబ్రవరి నెల 1 వ తేదీన గ్రామపంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగుస్తుండడంతో ఆ గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులను మండల పరిషత్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు జాబితాను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించారు.

మాడ్గుల మండలంలో మొత్తం 33 గ్రామ పంచాయతీలున్నందున వీటికి అవసరమైన మేరకు నియామకాలు జరగాలన్న ప్రభుత్వ సూచన మేరకు నిర్ణీత నమూనాలో మండల పరిషత్ అధికారులు జాబితాను రూపొందించినట్లు తెలిసింది. ప్రతి అధికారి హోదా, ఏ గ్రామానికి ప్రత్యేకాధికారిగా ఉంటారు.. సెల్‌ఫోన్‌ నంబరు, వారు నిర్వహించే శాఖ, తదితర సమాచారాన్ని క్రోడీకరించారు.

33 మంది అధికారులు అవసరం ఉన్నందున ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారిని వెంటనే విధుల్లో చేరాలని సమాచారం ఇచ్చారు.

ALSO READ : తెలంగాణ : రైతుల రుణమాఫీ పై గవర్నర్ కీలక ప్రకటన..!

29న ఉత్తర్వులు!:

ప్రత్యేకాధికారుల నియామకానికి సంబంధించి ఈ నెల 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెల 1న సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున అంతకంటే ముందే ప్రత్యేకాధికారులు గ్రామాలను సందర్శించి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని.. ఆయా పంచాయతీలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించే అవకాశం ఉందని మండలాధికారులు అంటున్నారు.

ALSO READ : తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!

వీరే ప్రత్యేకాధికారులు..

గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన విధిస్తే మండలంలోని వివిధ శాఖలో పనిచేసే తహసీల్దార్, ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారి , పంచాయతీరాజ్‌ సహాయ ఇంజినీర్, గ్రామీణ నీటి సరఫరా శాఖ (మిషన్‌ భగీరథ) సహాయ ఇంజినీర్, సమగ్ర శిశు అభివృద్ధి సేవాసంస్థ (ఐసీడీఎస్‌) సూపర్‌వైజర్లు,

మండల విద్యాధికారి,వ్యవసాయాధికారరి , పశువైద్యాధికారి , ఆరోగ్య వైద్య శాఖ సూపర్‌వైజర్లు, ఉప తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మండల పరిషత్‌ సూపరింటెండెంట్, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు అదనంగా పంచాయతీల బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.

ALSO READ : Google pay Lone : గూగుల్ పే వాడుతున్నారా.. ఈజీగా రూ.8 లక్షల లోన్, అతి తక్కువ ఈఎంఐ..!

సర్పంచులు తమ పదవి కాలాన్ని పొడిగించాలని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలుఅందజేశారు.రాష్ట్రంలో 91% మంది సర్పంచులు టిఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఉన్నారన్న కారణంతో సర్పంచుల పదవి కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించటం లేదని పలువురు సర్పంచులు చర్చించుకుంటున్నారు.