Rythu Mrithi : పాము కాటుకు రైతు మృతి..!

హత్నూర మండల పరిధిలోని ఓ వ్యక్తి పాము కాటు వేసి మృతి చెందాడు.

Rythu Mrithi : పాము కాటుకు రైతు మృతి..!

హత్నూర, మన సాక్షి:.

హత్నూర మండల పరిధిలోని ఓ వ్యక్తి పాము కాటు వేసి మృతి చెందాడు. వివరాలకు వెళితే ఇలా ఉన్నాయి హత్నూర మండలం సికింద్లపూర్ గ్రామానికి చెందిన చాకలి మల్లేశం (30) తన పొలం వద్ద రోజు మాదిరిగా తన పొలంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన పొలానికి నీళ్లు పారా పెట్టడానికి వెళ్లడంతో హఠాత్తుగా పాము కాటు వేసింది.

కాగా తన గ్రామంలోని వచ్చి తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో తక్షణమే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య శైలజ. ఇద్దరు పిల్లలు కలదు.

ALSO READ : KCR : ఫాఫం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడు నెలల ముచ్చటగా కారు పార్టీ కథ..!