Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసిద్దిపేట జిల్లా

Rythu : ట్యాంకర్లతో వరి పొలానికి నీరు.. ఎండుతున్న పంటలు రక్షించుకునేందుకు రైతుల తిప్పలు..!

Rythu : ట్యాంకర్లతో వరి పొలానికి నీరు.. ఎండుతున్న పంటలు రక్షించుకునేందుకు రైతుల తిప్పలు..!

రైతు కష్టాలను అడిగి తెలుసుకున్న మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్జ (గదేవపూర్),,మన సాక్షి :

జగదేవ్పూర్ మండలంలోని రాయవరం గ్రామంలో రైతులు ఎండిపోతున్న పొలాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కోచి తమ పొలాలను పారించుకుంటున్నారు. చూసి చలించి పోయి రైతు కనకయ్య కష్టాలను అడిగి తెలుసుకున్న మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా రైతు వంటేరు ప్రతాప్ రెడ్డి గారితో మాట్లాడుతూ చేతికొచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోతు ఉంటే ట్యాంకర్ల ద్వారా నీళ్లను కొనుక్కు వచ్చి పంటలను పారించుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

కాంగ్రెస్ పార్టీ సక్రమంగా కరెంటు ఇవ్వడం లేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గం లో కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులో ఉన్న నీళ్లను రైతులకు ఇవ్వడం లేదన్నారు,రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వక కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల తో చెలగాటమాడుతుందని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు,కాంగ్రెస్ ప్రభుత్వం విధానాల వలన కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు, గత కెసిఆర్ ప్రభుత్వంలో ఒక్క గుంట కూడా ఎండిపోయేది కాదని ప్రతి ఎకరానికి సాగునీరు కేసీఆర్ అందించారని చెరువులు నింపారని కుంటలు నింపారని చెక్ డ్యామ్ నింపారని కాల్వలలో ఎప్పుడు మండుటెండలో సైతం గోదావరి జలాలను పంట పొలాలను పంటలకు పారించుకునే వాళ్ళమని రైతులు వంటేరు ప్రతాపరెడ్డి తో తెలిపారు,

 

కానీ ప్రస్తుత కాంగ్రెస్ విధానాల వల్ల గజ్వేల్ నియోజకవర్గం లో కరువు పరిస్థితి ఏర్పడిందన్నారు, కల్లబొల్లి మాటలతో అసత్యపు వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తుంగలో తొక్కిందన్నారు, కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి తెలియజేశారు.

మరిన్ని వార్తలు చదవండి : 

Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!

Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

 

Good Friday : భక్తి శ్రద్దల మధ్య గుడ్ ఫ్రైడే వేడుకలు..!

KTR : యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరిక.. పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం..!

మరిన్ని వార్తలు