Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డివైద్యంహైదరాబాద్
Shankarpally : రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. కొడుకుకి గాయాలు..!
Shankarpally : రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. కొడుకుకి గాయాలు..!
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ కి చెందిన అశోక్ పని నిమిత్తం శంకర్‌పల్లి నుంచి పటాన్‌చెరుకు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి, పని ముగించుకొని తిరిగి వస్తుండగా భానుర్ నందిగామ మధ్యలో ట్యాంకర్ అతివేగంగా వచ్చి బండిని ఢీకొట్టగా.. రోడ్డుపై పడిపోయిన అశోక్ పైనుంచి ట్యాంకర్ వెళ్ళగా అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కుమారుడి రెండు కాళ్లు విరగగా.. బీడీఎల్ ఫ్యాక్టరీ దగ్గరలో గల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అశోక్ కి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ప్రమాదం ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
MOST READ :









