వరదలతో పంటల నష్టంపై క్షేత్ర స్థాయిలో సర్వే ప్రారంభం..!
వరదలతో పంటల నష్టంపై క్షేత్ర స్థాయిలో సర్వే ప్రారంభం..!
నేలకొండపల్లి, మన సాక్షి :
గత నాలుగు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాల వలన దెబ్బతిన్న పంటల నష్టం సర్వే ను ప్రారంభించినట్లు మండల వ్యవసాయాధికారి డి. అరుణకుమారి తెలిపారు. మండలం లోని అన్ని గ్రామాలలో పంట నష్టం సర్వే ను క్షేత్ర స్థాయిలో బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు… మండలం లో దెబ్బతిన్న పంటలను స్థానిక వ్యవసాయ విస్తీరణాధికారులు క్రాప్ వద్దకు చూసి నష్టం ను అంచనా వేయనున్నట్లు తెలిపారు. మండలం లోని వివిధ గ్రామాలలో పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న, చెరుకు తదితర పంటలు దెబ్బతిన్నట్లు రైతులు ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు.
ఏఈవో లు క్షేత్ర స్థాయి కి వచ్చినప్పుడు రైతులు సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు సర్వే జరుగుతుందని అన్నారు. మండలం లోని అన్ని గ్రామాలలో సర్వేను ఐదు రోజులలో పూర్తి చేసేలా శర వేగంగా చేయనున్నట్లు పేర్కోన్నారు.
కాగా పలువురు రైతులు తమకు పరిహారం అందేలా చూడాలని వ్యవసాయాధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీరణాధికారులు శిరీష. అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!
Miryalaguda : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం.. ఎమ్మెల్సీ కోటి రెడ్డి..!
Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!









