Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైం

Firing : తుపాకీల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది

తుపాకీల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది

చర్ల, మనసాక్షి:

తుపాకీల మోతతో (కిష్టారం )పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఆదివారం దండకారణ్యం దద్దరిల్లింది.పోలీసుల కు మావోయిస్టుల కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

 

తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసుల పై దాడి చేయాలనే లక్ష్యంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ ఆదివారం చేపట్టారు.పోలీసులపై ఆదివారం ఉదయం (కిష్టారం ) పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్టపాడు అటవీ ప్రాంతంలో సుమారుగా 6.10 గంటలకు అకస్మాత్తుగా ఒక ఎత్తైన ప్రదేశం నుండి మావోయిస్టులు కాల్పులు జరిపారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసు బలగాలు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు.కొన్ని నిమిషాల పాటు మావోయిస్టులకు,పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.అనంతరం ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి రెండు మృతదేహాలు,ఒక ఎస్ ఎల్ ఆర్ ఆయుధం,ఒక సింగల్ బోర్ తుపాకీ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

 

రెండు మృతదేహాల్లో ఒకరు చర్ల ఎల్ ఓ ఎస్ కమాండర్ మడకం ఎర్రయ్య@రాజేష్ గా గుర్తించారు.మరొక మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీస్ బలగాలు మృతి చెందిన మావోయిస్టుల నూ భద్రాచలం పోస్ట్ మర్టం నిమ్మితం తరలించారు.

మరిన్ని వార్తలు