Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం – ప్రకటన విడుదల చేసిన మావోయిస్టులు

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం – ప్రకటన విడుదల చేసిన మావోయిస్టులు

చర్ల,మనసాక్షి:

ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడం లో ప్రభుత్వం విఫలం అయ్యిందని తక్షణమే నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ{ బికె ఏ ఎస్ ఆర్} కార్యదర్శి ఆజాద్ పేరిట మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.


ఈ సందర్భంగా కార్యదర్శి ఆజాద్ లేఖ ద్వారా మాట్లాడుతూ తడిసిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,  కౌలు రైతులను గుర్తించి వారికి నష్టపరిహారం చెల్లించాలని పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయలు చెల్లించాలని, తడిసిన ధాన్యంతో పాటు ఇతర పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.

 

కౌలు రైతులను గుర్తించి వారికి పంట నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వ భూముల్లో పంటలు సాగు చేసే సన్నా చిన్న కారు రైతులను గుర్తించి వారికి పంట నష్టపరిహారం అందించాలని, రైతులందరూ సంఘటితంగా ఉండి పంట నష్టపరిహారం కోసం పోరాటం చేయాలని, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు