Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : ప్రభుత్వ బడిలో అక్షర పునాది, చెట్టు నీడన అభ్యసించి.. జేఎల్, డీఎల్ కొలువులు..!

Miryalguda : ప్రభుత్వ బడిలో అక్షర పునాది, చెట్టు నీడన అభ్యసించి.. జేఎల్, డీఎల్ కొలువులు..!

జేఎల్, డీఎల్ పరీక్షల్లో కొలువులు సాధించిన తిప్పన అనిత…!

మిర్యాలగూడ : మన సాక్షి :

చదువు…ఆటలు…అల్లరి… మానసిక, వ్యక్తిత్వ వికాసం, ఒత్తిడి, ఆంక్షలు లేని విద్య విధానాలకు నిలయమై పేద కుటుంబాల ఉన్నత లక్ష్యాలకు అంతరాలు లేని మానవీయ స్నేహ బంధాలకు … కేరాఫ్ గా నిలిచే ప్రభుత్వ బడిలో ఆమె అక్షరాలకు పునాది పడింది.

ప్రైవేట్ స్కూళ్ల గదుల్లో ఏర్పాటు చేసిన బ్లాక్ బోర్డు ముందు కాదు..సర్కార్ స్కూల్లో వేప చెట్టు నీడన నేలపై కూర్చుని విద్యాభ్యాసం చేసింది. ఇటీవల విడుదల చేసిన జేఎల్, డీఎల్ పరీక్షల్లో అర్హత సాధించి రెండు ప్రభుత్వ కొలువులు పొంది ఆదర్శంగా నిలుస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం…యాధ్గార్ పల్లి వాసి తిప్పన అనిత.

ప్రతి రోజు ఏడు గంటలు ప్రిపేర్…!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాధ్గార్ పల్లి విలేజ్ కు చెందిన తిప్పన సోమయ్య, యాదమ్మ దంపతుల కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తె లు. ఇందులో నాల్గవ సంతానమైన అనిత మొదటి నుంచి స్టడీ లో ఫస్ట్ ర్యాంకర్. కాగా ఇక్కడి యాధ్గార్ పల్లి జెడ్పీ హెచ్ ఎస్ లో ఫోర్త్ నుంచి టెన్త్ వరకు చదివింది. ఇంటర్మీడియట్ సవిత జూనియర్ కాలేజ్, విజేత డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్లీట్ చేసింది. భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో ఎం ఎస్సీ, సీఎస్ ఐఆర్_ఐఐ సీటీ లో కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్ డీ చేసింది. 2015 లో పెళ్లి కాగా ఆమెకు హార్దిక్, మోక్తిక సంతానం కలిగారు.

ALSO READ : Crime News : లవ్ చేస్తావా, పోటోలు వైరల్ చేయమంటావా.. ఇంటర్ కళాశాలలో కామాంధుడు..!

ఈ క్రమంలో తన పిల్లలను చూసుకుంటూనే మొదట గురుకుల లెక్చరర్ పోస్టు పరీక్ష రాసి కొద్ది తేడాతో కొలువును కోల్పోయింది. మళ్లీ కానిస్టేబులైన తన భర్త సహకారంతో రోజుకు 6 నుంచి 7 గంటల పాటు ప్రిపేరై జేఎల్, డీఎల్ పరీక్షలు రాసి ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఒకే సారి రెండు జాబ్స్ పొందటం గమనార్హం. కాన్ఫిడెన్స్ గా పోటీ పరీక్ష లకు సిద్ధమైతే … ఏ కొలువునైన సాధించడం కష్టం కాదంటున్న అనిత పలువురికి స్పూర్తిగా నిలుస్తోంది.

ALSO READ : Miryalaguda : మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ కు పోటాపోటీ.. గ్రూపుల లొల్లితో ఎమ్మెల్యేకు తలనొప్పి..!

మరిన్ని వార్తలు