Suryapet: కత్తిపోట్లకు పాల్పడిన నలుగురి నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన డి.ఎస్పీ నాగభూషణం

కత్తిపోట్లకు పాల్పడిన నలుగురి నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన డి.ఎస్పీ నాగభూషణం

సూర్యాపేట , మనసాక్షి

సూర్యాపేట పట్టణంలోని తల్లి తెలంగాణ విగ్రహం దగ్గర గురువారం పట్టణానికి చెందిన చీకూరు సంతోష్ పై జరిగిన హత్యాయత్నం కేసులో పట్టణానికి చెందిన నలుగురు నిందితులు వడ్లకొండ కృష్ణ ,చెరుకుపల్లి మహేష్, జాజుల మణిదీప్, శంకర శెట్టి ప్రేమ్,లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ పి, నాగభూషణం తెలిపారు. పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

 

పూర్వపరాలు ఇలా ఉన్నాయి. మొదటి నిందితుడు వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటికి ప్రస్తుతం గాయపడిన చీకూరి సంతోష్ కి గతంలో 2021 వ సంవత్సరం జూన్ నెలలో ఇరవైవేల రూపాయల డబ్బులు విషయంలో గొడవ జరిగిన సందర్భంలో చీకూరి సంతోష్ అతని స్నేహితులు ప్రస్తుత నిందితుడు వడ్లకొండ కృష్ణ పై కత్తితో దాడి చేయగా గాయాలపాలై 307 సెక్షన్ ఐపిసి లో సూర్యాపేట టౌన్ లో పిఎస్ నందు కేసు నమోదు చేసి సంతోష్ ను రిమాండ్ కు పంపినట్లు తెలిపారు .

 

ఇదే కేసును మనసులో పెట్టుకొని ఈ మధ్యనే తిరిగి సూర్యాపేటకు వచ్చిన సంతోష్ నిందితుడు కృష్ణను కేసు వాపస్ తీసుకోని రాజీ అవ్వమని లేని పక్షంలో చంపుతానని బెదిరించడంతో భయపడిన నిందితులు కృష్ణ అతని మిత్రులు సంతోష్ ను చంపితే నాకు ప్రాణహాని ఉండదని ఆలోచనతో తన మిత్రులైన మహేష్, మణిదీప్, ప్రేమ్ నాయుడులకు, ప్రణాళిక ప్రకారం తల్లి తెలంగాణ విగ్రహం దగ్గర ఒంటరిగా ఉన్నటువంటి సంతోష్ ను కత్తులు, రాళ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న స్థానికులు వారిని అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించారు.

 

ALSO READ :

1. Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు

2. Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!

 

శుక్రవారం ఉదయం పక్కా సమాచారం మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ వద్ద గల వ్యవసాయ మార్కెట్లో నిందితులు పట్టుబడ్డారని వారి వద్ద నుండి ఒక బైకు, స్కూటీ, ఒక చరవాణి ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

 

ఎలాంటి నేరాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదని వారిపైచట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏదైనా వ్యక్తులు బెదిరించిన ఎక్కడైనా దాడులు జరిగిన ఏదైనా నేరానికి సంబంధించి సమాచారం ఉన్నట్లయితే 100 నెంబర్ కుకాల్ చేయాలని చెప్పారు.

 

ఈ కేసును చేదించిన పట్టణ ఇన్స్పెక్టర్ జి ,రాజశేఖర్, ఇన్స్పెక్టర్ పి, శ్రీనివాస్, పట్టణ ఎస్ఐలు, యాకూబ్, సైదులు, సతీష్ ,కుశలవ, హెడ్ కానిస్టేబుల్స్ కృష్ణ, కరుణాకర్, వీరయ్య, కానిస్టేబుల్స్ ఆనంద్, బజార్,మధులను ఈ సందర్భంగా డిఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ పి,నాగభూషణం, పట్టణ సిఐ రాజశేఖర్, పట్టణ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు