Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Training : డబ్బులు ఖర్చు చేసినా.. లభించని శిక్షణ.. ఇక్కడ ఉచితం..!

Training : డబ్బులు ఖర్చు చేసినా.. లభించని శిక్షణ.. ఇక్కడ ఉచితం..!

దేవరకొండ , మనసాక్షి :

కొన్ని కలలు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నేర్చుకోలేనిది ఉంటాయి. అలాంటివారు శిక్షణ ఇచ్చేది చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా ఉచితంగా ఇవ్వడం అనేది మరింత అరుదు. అలాంటి శిక్షణ దేవరకొండ పట్టణంలో ఉచితంగా ప్రారంభించారు.

 

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము నందు ఉచిత డప్పు, పియానో సమ్మర్ క్యాంపును టౌన్ సీఐ శంకర్ , అధ్యక్షుడు ఎన్ వి టి సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు,

 

అనంతరం మాట్లాడుతూ దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సేవలను అభినందిస్తూ, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కొన్ని కలలు నేర్చుకోలేం, అలాంటిది ఉచితంగా డాన్స్, కరాటే, పాలిటెక్నిక్ కోచింగ్ ,పియానో, డప్పు, ఇలాంటి కలలను పిల్లలకు నేర్పిస్తున్న మాస్టర్స్ మరియు అసోసియేషన్ సభ్యులని అభినందించారు,

 

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ కి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు, దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, అలాంటి యువత పెడదారిన వెళ్ళరాదని, ముఖ్యంగా సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా అవుతున్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా వారు అన్నారు

 

ఈయొక్క డప్పు, పియానో మాస్టర్స్ నల్ల నరసింహ, శేఖర్, ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు డప్పు నేర్పించబడును, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు పియానో నేర్పించబడును, వివరాలకు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము నందు కలువ గలరు 9848759285, 9440433985,

 

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, రాపోలు నిరంజన్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, పంతులాల్ నాయక్, భాస్కర్ రెడ్డి, వెంకటేష్, రాజకుమార్ రెడ్డి, ఎల్ఐసి గిరి, కిషన్ లాల్, కుమార్, వివిఆర్ , కరాటే మాస్టర్ శ్రీను, డాన్స్ మాస్టర్ క్రాంతి, ఖాజా,

 

అజయ్ చంద్ర, జయలక్ష్మి, కవిత, దీపిక, శ్రీను, డాన్స్ మాస్టర్ జగన్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సిబ్బంది నవీన్, సుదర్శన్ రెడ్డి, వేణుగోపాల్, ఆకాష్ ,అంజి ,దినేష్, అశోక్, టిల్లు, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు