స్నేహితుడి కుటుంబానికి ఆసరా

స్నేహితుడి కుటుంబానికి ఆసరా

అర్వపల్లి , అక్టోబర్ 16, మన సాక్షి : ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. వారిలో ఒకరు అనారోగ్యంతో మృతి చెందడంతో వారు చిన్ననాటి స్నేహితులందరూ కలిసి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. మండల పరిధిలోని లోయ పెళ్లి గ్రామానికి చెందిన బట్టు లింగస్వామి మృతి చెందడంతో వారు చిన్ననాటి స్నేహితులు 30 వేల రూపాయలను ఆ కుటుంబానికి అందజేశారు. అదేవిధంగా ఇద్దరు పిల్లలను చదివించేందుకు సహాయం చేస్తామని తెలిపారు.

మృతి చెందిన లింగస్వామి నిరుపేద కుటుంబం కావడంతో స్నేహితులు చేసిన ఈ సహాయం మర్చిపోలేనిదని లింగస్వామి కుటుంబ సభ్యులు తెలిపారు. మంచాల సైదులు వల్లపు లింగయ్య బండోజు చంద్రశేఖర్ వేణు పాల్గొన్నారు.