స్నేహితుల దినోత్సవం రోజే.. ఆత్మీయ సమ్మేళనం..!

స్నేహితుల దినోత్సవం రోజే.. ఆత్మీయ సమ్మేళనం..!

మిర్యాలగూడ , మనసాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు స్నేహితుల దినోత్సవం రోజు కలుసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడకమల్ల లో 1995-1996 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.

 

ALSO READ :

  1. BREAKING : ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇకలేరు..!
  2. మిర్యాలగూడ : లోటస్ స్కూల్ చిన్నారులకు.. అంతర్జాతీయ స్వర్ణ నంది పురస్కారాలు..!
  3. Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
  4. PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!

 

ఆ నాడు 10 వ తరగతి చదివిన 40 మంది విద్యార్థులు పాల్గొని ఆనాటి బాల్య సృతులను గుర్తు చేసుకోవడం జరిగింది. తమకు విద్యాబోధన చేసిన గురువులను సన్మానిచారు. ఈ కార్యక్రమం లో నాటి ఉపాద్యాయులు ఎస్.కె గులాం రసూల్, అచ్చిరెడ్డి, పోరెడ్డి ఇంద్రారెడ్డి, అనంతుల నాగయ్య, కొత్తపల్లి జోషఫ్ లు విద్యార్థులు రాచకొండ రవీందర్, ఓంకార్, నాగబాబు, సైదులు, సింగు సైదులు , రమేష్, గీత, చంద్రకళ, ఖలేధా తదితరులు పాల్గొన్నారు.