Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లావైద్యం

Narayanpet : లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం..!

Narayanpet : లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం..!

నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

నారాయణపేట టౌన్, మనసాక్షి :

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, జిల్లాలోని ఏదేని ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రుజువైతే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భస్థ పూర్వo, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం -1994 జిల్లా స్థాయి బహుళ సర్వ సభ్య అప్రాప్రియెట్ అథారిటీ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఎన్ని సాధారణ కాన్పులు జరిగాయి ? ఎన్ని సిజరిన్ ఆపరేషన్లు జరిగాయో వివరాల జాబితా తయారు చేసి ఇవ్వాలన్నారు. అలాగే జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల వివరాలు, అయా సెంటర్లలో ఇప్పటివరకు ఎన్ని ఫ్యానింగ్ లు చేశారనే వివరాలు తనకు తెలపాలని డిఎం అండ్ హెచ్ ఓ కు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఏదేని ఆస్పత్రిలో లింగ నిర్ధారణ నిషేధ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహారిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీ ఎం అండ్ హెచ్ ఓ ను ఆయన ఆదేశించారు.

కాగా అంతకు ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం -1994 అమలు గురించి సమావేశంలో క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శైలజ, మలేరియా అధికారి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Telangana : గులాబి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు ముహూర్తం ఫిక్స్.. ఎంతమంది ఉన్నారంటే..!

మరిన్ని వార్తలు