ఆడుకునేందుకు వెళ్లి.. అదృశ్యం..!

ఆడుకునేందుకు బయటకు వెళ్లి బాలుడు కనబడకుండా పోయిన ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను  పోలీసులు తెలిపారు.

ఆడుకునేందుకు వెళ్లి.. అదృశ్యం..!

శేరిలింగంపల్లి , మన సాక్షి :

ఆడుకునేందుకు బయటకు వెళ్లి బాలుడు కనబడకుండా పోయిన ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను  పోలీసులు తెలిపారు. శేరిలింగంపల్లి వెంకటరెడ్డి కాలనీలో నివాసం ఉండే పొన్నం కుమార స్వామి, సమతలకు ఇద్దరు సంతానం.

చిన్నవాడు పొన్నం సాత్విక్ (14) లింగంపల్లి నారాయణ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.రోజులాగే సోమవారం కూడా స్కూల్ కు వెళ్లి వచ్చిన సాత్విక్ బ్యాగ్ ఇంట్లో పెట్టి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా, స్నేహితులను అడిగినా సాత్విక్ ఆచూకీ లభించలేదు.

దీంతో బాలుడి తల్లిదండ్రులు మంగళవారం చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ALSO READ : BREAKING : తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం