గోల్డ్ స్కీం పేరిట మోసం.. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన..!

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని గువ్వలగూడెం గ్రామంలో గోల్డ్ స్కీం పేరిట మోసం చేశారని ఆరోపిస్తూ తమకు చేయాలని బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

గోల్డ్ స్కీం పేరిట మోసం.. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన..!

నేలకొండపల్లి, మన సాక్షి:

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని గువ్వలగూడెం గ్రామంలో గోల్డ్ స్కీం పేరిట మోసం చేశారని ఆరోపిస్తూ తమకు చేయాలని బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన కొంత మంది నెల నెలా డబ్బులు చెల్లిస్తే ఏడాది కాగానే బంగారం తో పాటు… కట్టిన డబ్బులు కూడ ఇస్తామని చెప్పటంతో గ్రామంలో చాలా మంది ప్రతీ నెలా క్రమం తప్పకుండా కట్టారు.

గ్రామానికి చెందిన పార్వతి రూ.60 వేలు, చంద్రకళ రూ.1.20 లక్షలు, ఉపేందర్ రూ.50 వేలు. ఇలా గ్రామంలో మరో 10 మంది నుంచి దాదాపు రూ.5 లక్షల వరకు గోల్డ్ స్కీంలో పొదుపు చేశారు. వీరే కాకుండా పకు గ్రామమైన గోకినేపల్లి లో కూడ చాలామంది బాధితులు చెల్లించారని ఆరోపణలు వినవస్తున్నాయి.

కానీ గడువు తీరిన తరువాత కూడ చెల్లించకపోవటంతో అనుమానం కలిగింది. పలుమార్లు వెళ్లి అడిగినప్పటీకీ కనీసం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. సదరు వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నాడని తెలిపారు. చేసేది లేక గురువారం గ్రామంలో చంద్రకళ, పార్వతి, ఉపేందర్ లు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేసే వరకు కిందకు వచ్చేది లేదని బీష్మించుకున్నారు. విషయం తెలుసుకుని

పోలీసులు ఘటనా స్థలం కు చేరుకుని బాధితులతో మాట్లాడారు…..న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వటంతో ఎట్టకేలకు వాటర్ ట్యాంక్ కు దిగి వచ్చారు. అనంతరం పోలీసులు వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు.