Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : గొర్ల ఇంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన రంగన్న

గొర్ల ఇంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన రంగన్న

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గొర్ల ఇంద్రారెడ్డి విగ్రహాన్ని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు రంగారెడ్డి మంగళవారం తడకమళ్ళ గ్రామంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ గొర్ల ఇంద్రారెడ్డి సిపిఎం పార్టీకి ఎంతో సేవలు చేశారని కొనియాడారు. తడకమళ్ళ గ్రామంలో పార్టీ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసిన పార్టీలో బలమైన ఉద్యమాలు చేశారని అన్నారు.

 

Also Read : Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!

 

గొర్ల ఇంద్రారెడ్డి సేవలను స్మరించుకున్నారు. అమరవీరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బింగ్ మల్లేష్, మల్లు నాగార్జున రెడ్డి,

 

పాదూరి శశిధర్ రెడ్డి, వేములపల్లి వైస్ ఎంపీపీ గోవర్ధని, రవి నాయక్, పరశురాములు, సీతారాములు, ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామం సిపిఎం నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు